రామ్ పోతినేని క్రేజీ ప్రాజెక్ట్ కూడా వెనక్కి తగ్గేది లేదా!?

Ram-Pothuneni

మన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తన స్వీయ దర్శకత్వం లోనే ఓ సాలిడ్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్ర కింగ్ తాలూకా పూర్తి స్థాయిలో విజయం అందుకోకపోవడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. దీనితో తానే దర్శకునిగా మారి చేస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ కూడా చేశారు.

అయితే ఈ ప్రాజెక్ట్ తోనే అదే సమయంలో సీనియర్ స్టార్స్ బాలయ్య, నాగార్జున ఇంకా మరికొన్ని సినిమాలు రేస్ లో ఉన్నాయి. కానీ అయినప్పటికీ రామ్ పోతినేని సినిమా వెనక్కి వెళ్లే ఛాన్స్ లేదని తెలుస్తుంది. సో డిసెంబర్ ఎండింగ్ లో కూడా మంచి రసవత్తరమైన పోటీ నెలకొంటుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి ఏక – ది లోన్ వూల్ఫ్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని కూడా లాక్ చేసినట్టు లేటెస్ట్ బజ్ వినిపించింది. ఇక ఇతర వివరాలు మున్ముందు బయటకి రావాల్సొ ఉన్నాయి.

Exit mobile version