ఇంటర్వ్యూ :- రాంప్రసాద్‌ – ‘జబర్దస్త్‌’లో చేస్తే వచ్చే పేరు ఇక ఏ షోలో చేసినా రాదు.

ఇంటర్వ్యూ :- రాంప్రసాద్‌ – ‘జబర్దస్త్‌’లో చేస్తే వచ్చే పేరు ఇక ఏ షోలో చేసినా రాదు.

Published on Feb 3, 2020 4:08 PM IST

 

‘జబర్దస్త్‌’ షో ద్వారా పాపులర్‌ అయిన సుధీర్, గెటప్‌ శ్రీను, రాంప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘త్రీ మంకీస్‌’. జి. అనిల్‌ కుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమాను జి. నగేష్‌ నిర్మించారు. కారుణ్య చౌదరి కథానాయిక. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. కాగా ఈ సంధర్భంగా రాంప్రసాద్‌ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం…

 

‘త్రీ మంకీస్‌’ టైటిల్ ఎందుకు పెట్టారు. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే పెట్టారా ?

అవును. ఫస్ట్ డైరెక్టర్ గారు ‘త్రీ మంకీస్‌’ అని టైటిల్ చెప్పినప్పుడే బాగుంది అనుకున్నాం. అయితే ఆ తరువాత వేరే టైటిల్ కోసం చాల చూశాం గాని, చివరికీ ‘త్రీ మంకీస్‌’ టైటిలే బాగుంటుందని ఫిక్స్ అయ్యాం.

 

ఈ సినిమా ఎలా ఉండబోతుంది. అవుట్ ఫుట్ ఎలా వచ్చింది ?

ఒక బ్యాడ్ నుంచి స్టార్ట్ అయి గుడ్ వేలో వెళ్తుంది. అంటే బ్యాడ్ థింగ్స్ తో మా క్యారెక్టర్స్ మొదలై.. అనుకోకుండా ఒక సమస్యలో ఇరుక్కుని చివరికీ ఒక మంచి కోసం మేము ఏం చేశాం అనేదే సినిమా అండి. సినిమాలో మంచి కామెడీతో పాటు మంచి ఎమోషన్ కూడా ఉంది.

 

బేసిగ్గా మీరు రైటర్. మరి మీరు యాక్ట్ చేస్తోన్న సినిమాల్లో కూడా మీరు రాస్తారా ?

సినిమాలో నన్ను పెట్టుకునేదే స్క్రిప్ట్ లో హెల్ప్ అవుతానని. ఆ విధంగానే చాలా సినిమాలకి పని చేశాను. కామెడీలో నాకు మంచి పట్టు ఉంది. కామెడీ ఎలాగైనా నేను రాయగలను.

 

మరి ఈ సినిమాలో కూడా రాశారా ?

లేదండి. ఈ సినిమాలో నేను స్క్రిప్ట్ లో కూర్చోలేదు. డైరెక్టర్ గారే స్క్రిప్ట్ రాసుకున్నారు.

 

ఈ సినిమాలో మీ పాత్ర గురించి ?

ఆనంద్ అనే పాత్రలో యాక్ట్ చేశాను, సాఫ్ట్ వేర్ క్యారెక్టర్. నా క్యారెక్టర్ మంచి ఎమోషనల్ గా కూడా ఉంటుంది.

 

ఇండస్ట్రీకి వచ్చింది మీరు రైటర్ అవుదామనా ? లేక యాక్టర్ అవుదామనా ?

ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఒక ఎడిటర్ దగ్గర వర్క్ చేశాను. ఆ తరువాత అనుకోకుండా రైటర్ గా వర్క్ చేశాను. అయితే జోష్ సినిమాలో యాక్ట్ చేసినా ఆ తరువాత నాకు ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. మళ్లీ ఇంటికి వెళ్ళిపోయి.. చాల గ్యాప్ తీసుకోని ఇండస్ట్రీకి వచ్చాను.

 

మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా సాగింది మీ జర్నీ ?

వెనక్కి తిరిగి చూసుకోలేదండి. షోలు అండ్ ఈవెంట్స్ రాస్తున్నాను. సినిమాలు చేస్తున్నాను. కెరీర్ ఇటు బాగా స్లోగా లేదు, అటు బాగా స్పీడ్ గా లేదు. ప్రస్తుతం బాగానే వెళ్తుంది.

 

‘జబర్దస్త్‌’కి పోటీగా వేరే ఛానల్స్ లో కూడా కొన్ని షోస్ మొదలయ్యాయి. ఆ షోల నుండి మీకు ఆఫర్స్ వచ్చే ఉంటాయిగా. ఎందుకు చెయ్యట్లేదు ?

‘జబర్దస్త్‌’లో చేస్తే వచ్చే పేరు ఇక ఏ షోలో చేసినా రాదు. అందుకే నేను వేరే ఏ షోకి వెళ్లలేదు. ‘జబర్దస్త్‌’ అనేది ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. అది ఒక మ్యాజిక్. మళ్లీ ఒక కొత్త షోతో అలాంటి మ్యాజిక్ జరగాలంటే సాధ్యం కాదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు