పూరి జగన్నాథ్, రామ్ ఇద్దరూ ‘ఇస్మార్ట్ శంకర్’ విజయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సంబరాల్లోనే పూరి పుట్టినరోజు రావడంతో సెలబ్రేషన్స్ ఇంకాస్త గట్టిగా జరిగాయి. చిత్రాన్ని మూడురోజుల పాటు రీరిలీజ్ చేశారు కూడా. ఇక
హీరో రామ్ అయితే పూరికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు.
ఇంతకీ ఆ ఖరీదైన గిఫ్ట్ ఏమిటని అనుకుంటున్నారా.. అదే డెవిఅలెట్ గోల్డ్ ఫాంటమ్ అనే వైర్ లెస్ స్పీకర్స్. వీటి ఖరీదు పాతిక వేల వరకు ఉంటుంది. వాటిలో ‘ఇస్మార్ట్ శంకర్’ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు పూరి. గతంలో కూడా రామ్ పూరికి ఖరీదైన కోపిలువాక్ కాఫీని బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే.
Looooveeeee u our ustaaaad @ramsayz for this auwsum Bday gift to @purijagan .. he is flying high ???????????????? @DEVIALET #goldphantom ???????????? pic.twitter.com/eo4205tbl6
— Charmme Kaur (@Charmmeofficial) September 30, 2019
