రామానాయుడు నన్ను సొంత కొడుకులా చూసారు – అనిల్ కపూర్

Anil-Kapoor
50 ఏళ్ళ పాటు ఎదురులేని నిర్మాతగా తెలుగు సినీ ప్రపంచానికి ఎనలేని సేవలందించిన ది గ్రేట్ లెజెండ్ డా. డి. రామానాయుడు గారి శఖం ముగిసింది. కొద్ది సేపటి క్రితమే రామానాయుడు స్టూడియోస్ లో ఆయన అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. రామానాయుడు గారు తన కెరీర్లో ఎంతోమంది హీరోలకి, హీరోయిన్స్ కి, దర్శకులకి లైఫ్ ఇచ్చారు. అలా బాలీవుడ్ లో రామానాయుడు అనిల్ కపూర్ హీరోగా 5 సినిమాలు చేసాడు. ఆ సినిమాలు అనిల్ కపూర్ కి మంచి బ్రేక్ ఇచ్చాయి.

ఈ రోజు జరిగిన అంత్యక్రియలకి హాజరైన అనిల్ కపూర్ రామానాయుడుని చూసి శోఖ సముద్రంలో మునిగిపోయాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘రామానాయుడు గారు నన్ను నా ముంబై కొడుకు అని పిలిచేవారు. ఆయన నన్ను తన సొంత కొడుకులా, తన ఫ్యామిలీలో ఒకరిలా చూసుకునే వారు. రామానాయుడు లేని ఇండియన్ సినిమాని ఊహించుకోవడం చాలా కష్టం. ఆయన అందించిన సేవలు మరువలేనివని’ అనిల్ కపూర్ అన్నాడు.

Exit mobile version