సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ చిత్రమే “వారణాసి” (Varanasi). దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా కోసం రాజమౌళి మన దగ్గరే ఒక మోషన్ పిక్చర్ టెక్నాలజీతో కూడిన స్టూడియోని కూడా తీసుకొచ్చారు.
అన్నపూర్ణ స్టూడియోస్ లో సెట్ చేసిన ఈ స్టూడియో లోనే తన ప్రస్తుత సినిమా వారణాసి లో కీలక సన్నివేశాలు తెరకెక్కించినట్టు తెలిపారు. అయితే ఈ మేజర్ పోర్షన్ ఏదో కాదు రామాయణ ఎపిసోడ్ లోనిదే అని నిన్న వదిలిన వీడియోలో సీన్స్ తో ఖరారు అయ్యింది. అందులో కొందరు మోషన్ కాప్చర్ సూట్ ని వేసుకొని గదాదండం పట్టుకొని కనిపిస్తున్నారు. దీనితో ఈ సీక్వెన్స్ లు వారణాసి లోని అత్యంత కీలక రామాయణ ఘట్టపు యుద్ధ సన్నివేశాలే అని చెప్పాలి. మరి వానర సైన్యంతో ఈ యాక్షన్ బ్లాక్ లు ఏ లెవెల్లో రాజమౌళి ప్రెజెంట్ చేస్తారో చూడాల్సిందే.
