
యంగ్ హీరో రామ్ హీరోగా నటించనున్న ‘పండగ చేస్కో’ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. గత కొన్ని రోజులుగా ఈ చిత్ర టీం మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీగా ఉన్నారు. మ్యూజిక్ వర్క్ ఫినిష్ కావడంతో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు.
రామ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని డైరెక్టర్. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి పరుచూరి ప్రసాద్ నిర్మాత. యాక్షన్, కామెడీ కలగలిపిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. వరుస షెడ్యూల్స్ తో సినిమాని చాలా ఫాస్ట్ గా పూర్తి చేయడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేసుకుంది.