అరకులో రామ్ ‘హరికథ’

Ram-Shivam
‘పండగ చేస్కో’ సినిమాతో ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న హిట్ దక్కడంతో హ్యాపీగా ఉన్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్, ఆ తర్వాత వెంటనే వరుసగా రెండు సినిమాలను చేసేస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నాడు. గత కొన్నిరోజులుగా వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో ఒకేసారి శివం, హరికథ సినిమా షూటింగు చేస్తూ కనిపించి సందడి చేసిన విషయం తెలిసిందే! ఈ రెండు సినిమాల్లో తాజాగా హరికథ అరకుకు షిఫ్ట్ అయింది. అరకు ప్రాంతంలోని పలు అందమైన లొకేషన్లలో ప్రస్తుతం హరికథ షూటింగ్ జరుగుతోంది.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరికథ సినిమాకు సంబంధించిన తాజా అరకు షెడ్యూల్‌లో రామ్‌తో పాటు సీనియర్ నటులైన సత్యరాజ్, నరేష్ తదితరులు పాల్గొంటున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక శివం, హరికథ రెండు సినిమాలనూ స్రవంత్రి రవికిషోర్ నిర్మిస్తుండగా, రెండు సినిమాలకూ దేవిశ్రీ ప్రసాదే సంగీత దర్శకుడు. ఇక శివం సినిమా విషయానికి వస్తే కొత్త దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశిఖనాన్నా నటిస్తోంది.

Exit mobile version