‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాస్త ఉస్తాద్ రామ్ అయిపోయాడు. ఈ సినిమాతో యాక్షన్ హీరోగా సెటైలవ్వానుకున్న రామ్ ఆశలకు గట్టి పునాది పడింది. ఆ తర్వాత చేసిన ‘రెడ్’ సినిమా కూడ మంచి ఫలితాన్నే అందుకుంది. దీంతో రామ్ ఈసారి ఇంకాస్త పెద్ద స్థాయిలో సెటప్ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ సినిమాతో యాక్షన్ హీరోగా బలంగా పాటుకుపోవాలని భావిస్తున్నాడు. అందుకే లింగుస్వామిని లైన్లోకి తీసుకున్నాడు. లింగుస్వామికి యాక్షన్ సినిమాల దర్శకుడిగా మంచి పేరుంది. విశాల్ ను ‘పందెం కోడి’ సినిమాతో యాక్షన్ హీరోను చేసేశారు ఆయన.
అందుకే ఈసారి బాధ్యతను ఆయన మీద పెట్టాడు రామ్. రేపే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు. సినీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా సబ్జెక్ట్ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. నిజానికి లింగుస్వామి అల్లు అర్జున్ హీరోగా ఒక ద్విభాషా చిత్రాన్ని రూపొందించడానికి రెడీ అయ్యారు. కానీ అది టేకాఫ్ కాలేదు. ఆగిపోయిందా లేకపోతే వాయిదా పడిందా అనేది కూడ క్లారిటీ లేదు. ఈ సందిగ్దత కొనసాగుతుండగానే రామ్ సినిమా తెరపైకి వచ్చింది. మరి చూడాలి ఈ సినిమాతో రామ్ ఏ స్థాయిలో ఎలివేట్ అవుతాడో.
