యూరప్ లో అడ్వెంచర్స్ చేయనున్న రామ్ !

యంగ్ హీరో రామ్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మంచు ప్రాంతాల్లో సాగే అడ్వెంచరస్ డ్రామాగా ఉండనుంది. అందుకే ఈ సినిమాను ఎక్కువ భాగం యూరప్లో షూట్ చేయనున్నారు. హెవీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండనున్న ఈ సినిమాలో రామ్ సరికొత్త లుక్లో కనిపిస్తారట.

అంతేగాక ఈ చిత్రంలో తమిళ పరిశ్రమకు చెందిన ఒక పాపులర్ నటుడు, బాలీవుడ్ కు చెందిన దర్శన్ కుమార్, మలయాళ నటుడు సంజు శివరామ్ లు పలు కీలక పాత్రలు పోషించనున్నారు. మే మొదటి వారం నుండి మొదలుకానున్న ఈ చిత్రాన్ని స్రవంతి రవి కిశోర్ నిర్మిస్తుండగా కథానాయకిగా మాళవిక శర్మ పేరును పరిశీలిస్తున్నారు దర్శక నిర్మాతలు.

Exit mobile version