రామ్ రెడ్ రిలీజ్ పై ఫ్యాన్స్ ఆసక్తి !

RED

కరోనా మహమ్మారి దెబ్బకు ఎప్పుడో సమ్మర్ లో రావాల్సిన సినిమాలు పూర్తిగా గందరగోళంలో పడటంతో.. ఇష్టం లేకపోయినా మేకర్స్ తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు రిలీజ్ అయిపోయాయి. అయితే ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన రామ్ ‘రెడ్’ మాత్రం ఇంకా క్లారిటీ లేకుండానే ఉంది. సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ అన్నారు గాని, అప్పుడు కూడా గ్యారెంటీగా రిలీజ్ అవుతుందనేది ఇంకా క్లారిటీ లేకపోవడంతో రామ్ సినిమా ఎప్పుడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కాగా మరోపక్క రామ్ తన సినిమాని నేరుగా థియేటర్ లోనే రిలీజ్ చేయటానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడని తెలుస్తోంది. ఎలాగూ సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్‌ హీరోగా చేస్తున్న సినిమా కావడంతో, ఈ రెడ్ సినిమా పై మంచి హైప్ ఉంటుందనే హోప్స్ తో ఈ సినిమా రిలీజ్ విషయంలో రామ్ పట్టు పట్టాడట. కాగా ఈ క్రమంలో సంక్రాంతికి అన్ని కుదిరితే ఈ సినిమాని నేరుగా థియేటర్ లో రిలీజ్ చేయాలని రామ్ ప్లాన్ చేస్తున్నాడట.

Exit mobile version