“ఇస్మార్ట్ శంకర్” తో జస్ట్ ఫామ్ లోకి రావడమే కాకుండా రెట్టింపు ఎనర్జీతో మాస్ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ను తెచ్చుకున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. దాని తర్వాత తన క్లాస్ దర్శకుడు కిషోర్ తిరుమలతో ప్లాన్ చేసిన పక్కా మాస్ థ్రిల్లర్ సినిమా “రెడ్”. మంచి హైప్ ను తెచ్చుకున్న ఈ చిత్రం తాలూకా సాలిడ్ ట్రైలర్ ను మేకర్స్ ఇప్పుడే విడుదల చేశారు. ఇక దీని విషయానికి వస్తే డ్యూయల్ రోల్ లో రామ్ పవర్ ప్యాకెడ్ గా ఉన్నాడని చెప్పాలి.
రెండు కంప్లీట్ గా డిఫరెంట్ షేడ్ ఇన్నోసెంట్ రోల్ లో ఏమో కానీ మాస్ రోల్ లో అయితే కొత్త యాటిట్యూడ్ ను రామ్ కనబరిచాడు. అలాగే ఈ ఇద్దరికీ ఉన్న లింక్ ఎవరు నెగిటివ్ ఎవరు పాజిటివ్ అన్నది మంచి ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్ లో చూపించారు. అలాగే రామ్ మ్యాచో లుక్స్ మరోసారి అదిరాయి అని చెప్పాలి. అలాగే నివేతా పెత్తురాజ్ పై డిజైన్ చేసిన పోలీస్ రోల్ దాని చుట్టూతా తిరిగే ఇన్వెస్టిగేషన్ డ్రామా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.
ఇక అలాగే ఈ ట్రైలర్ తో మంచి సిట్యుయేషనల్ కామెడీని కూడా చూపించారు. మరి మణిశర్మ సంగీతం విషయానికి వస్తే ఇప్పటికే పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది అలాగే ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే పక్కాగా ఉంది. ఓవరాల్ గా మాత్రం ఈసారి రామ్ డ్యూయల్ ధమాకాను థియేటర్స్ లో గట్టిగానే సెట్ చేసినట్టు ఉన్నాడని చెప్పాలి. ఈ చిత్రానికి స్రవంతి రవి కిషోర్ నిర్మాణం వహించగా మేకర్స్ ఈ మాస్ థ్రిల్లర్ ను సంక్రాంతికి ఫిక్స్ చేసేసారు.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
