‘బెంగళూర్ డేస్’ షూట్ పూర్తి చేసిన రానా

rana
‘బాహుబలి’లో భల్లాల దేవగా కనిపించి దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయిన హీరో రానా, బాహుబలికి సెకండ్ పార్ట్ అయిన ‘బాహుబలి ది కంక్లూజన్’ మొదలవ్వడానికి ముందు బెంగళూర్ డేస్ రీమేక్‌తో బిజీగా మారిన విషయం తెలిసిందే. మళయాలంలో ఘన విజయం సాధించిన బెంగళూర్ డేస్ సినిమా తమిళ రీమేక్‌లో రానా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆర్య, బాబీ సింహ, శ్రీదివ్య ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక గత కొన్ని నెలల క్రితం మొదలైన ఈ సినిమాలో రానాకు సంబంధించిన పార్ట్ నేటితో పూర్తైంది. ఇదే విషయాన్ని రానా తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా తెలియజేస్తూ.. ‘బెంగళూర్ డేస్’ లాంటి అందమైన సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉందని, టీమ్ మొత్తం షూటింగ్‌ను బాగా ఎంజాయ్ చేశామని తెలిపారు. పీవీపీ సంస్థ పెద్ద ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో రానా సరసన సమంత చిన్న గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. ఇక బెంగళూర్ డేస్‌లో తన పార్ట్ పూర్తవ్వడంతో రానా బాహుబలి ది కంక్లూజన్ కోసం సిద్ధం కానున్నారు. నవంబర్‌లో బాహుబలి ది కంక్లూజన్ సెట్స్‌పైకి వెళ్ళనుంది.

Exit mobile version