
దాదాపు 20 ఏళ్ళ తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ మల్టీ స్టారర్ సినిమాలు ఊపందుకున్నాయి. అందులోనూ ఒకే ఫ్యామిలీ లో ఎక్కువ హీరోలు ఉండడం వల్ల వాళ్ళ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమాలను అభిమానులు ఆశిస్తున్నారు. అలా అక్కినేని ఫ్యామిలీ హీరోలంతా కలిసి నటించిన సినిమా ‘మనం’ గత సంవత్సరం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. వీరి బాటలోనే దగ్గుబాటి ఫ్యామిలీ హీరోస్ అంతా కలిసి ఓ సినిమా చేయాలనుకున్నారు. ఈ సినిమా గురించి చాల రోజుల నుంచి వార్తల్లో ఉన్నా కచ్చితమైన క్లారిటీ మాత్రం లేదు.
తాజాగా సోషల్ మీడియా ట్విట్టర్ లో జరిగిన చిట్ చాట్ లో రానా ఈ మల్టీ స్టారర్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు. ప్రసతుతం స్క్రిప్ట్ కి సంబదించిన వర్క్ జరుగుతోందని, వచ్చే ఏడాది కచ్చితంగా సినిమా ఉంటుందని తెలిపాడు. రానా ప్రస్తుతం బాహుబలి సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత బాహుబలి సినిమా సెకండ్ పార్ట్ షూట్ లో బిజీ అవుతాడు. ఇది కాకుండా బెంగుళూరు డేస్ రీమేక్లో రానా ఓ ముఖ్య పాత్రలో నటించాడు. దగ్గుబాటి హీరోలైన వెంకటేష్, రానా కలిసి నటించనున్న ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య కూడా కలిసి నటించే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ పై నిర్మించనున్నారు. ఈ మూవీకి ఎవరు దర్శకత్వం వహించబోతున్నారు అన్నది తెలియాల్సి ఉంది. సో ఫ్రెండ్స్ గెట్ రెడీ ఫర్ దగ్గుబాటి మల్టీ స్టారర్ మూవీ..