
‘బాహుబలి’ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాక, ఆ సినిమాకు పనిచేసిన వారిని నేషనల్ లెవల్ స్టార్స్‌ని చేసేసింది. ఇక ఇంతకుముందే తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రానా, ‘బాహుబలి’తో స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నారు. ఇక ఈ స్టార్డమ్తో కెరీర్లో దూసుకుపోవడంతో పాటు, పలు సామాజిక కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటూ రానా నిజమైన స్టార్ అనిపించుకుంటున్నారు.
హెల్థీ స్టార్ట్ పేరుతో క్రై (చిల్డ్రన్ రైట్స్ అండ్ యూ) అనే సంస్థతో బెంగళూరుకు చెందిన విన్ విన్ అనే సంస్థతో కలిసి ఓ ప్రోగ్రామ్ మొదలుపెట్టింది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా అప్పుడే పుట్టిన పసి పిల్లల్లో తలెత్తే సమస్యలకు వైద్య చేయడానికి కావాల్సిన నిధులు సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ సంస్థకు రానా తనవంతు సహాయం చేయడంతో పాటు అభిమానులు ఫండ్స్ డొనేట్ చేయవలసిందింగా కోరారు. ఇక ఫండ్స్ డొనేట్ చేసే వారిలో ఒకరికి రానాతో కలిసి లంచ్ చేసే అవకాశం కూడా ఈ సంస్థ కల్పిస్తోంది.
ఇక తమకొచ్చిన స్టార్‌డమ్‌ను కేవలం కెరీర్‌ను డెవలప్ చేసుకోవడానికే కాకుండా, ఇలా పలు సామాజిక్ కార్యక్రమాల్లోనూ భాగమవుతూ తెలుగు హీరోలు బయట కూడా హీరోలమని ఋజువు చేసుకుంటున్నారు. ఇక రానా, క్రై కలిసి చేస్తోన్న ఈ ప్రయత్నంలో పాలు పంచుకొని మీరూ డొనేట్ చేయదలుచుకుంటే www.vynvyn.com/Rana అనే డొమైన్‌కి వెళ్ళొచ్చు.