‘రానా’ కోసం ఎదురు చూస్తోన్న ‘విరాట పర్వం’ !

virata

‘నీది నాది ఒకే కథ’ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ ‘వేణు ఉడుగుల’, కాగా ఈ దర్శకుడు తన రెండో సినిమాగా రానా, సాయిప‌ల్ల‌విలను హీరోహరోయిన్ లుగా పెట్టి ‘విరాట పర్వం` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రాంతంలోని 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా పీరియాడిక్ సోషల్ డ్రామాగా ఈ మూవీ రానుంది. అయితే చికిత్స కోసం అమెరికాకి వెళ్లిన రానా ఇండియాకి తిరిగివస్తున్నారు. త్వరలో విరాటపర్వం షూటింగ్ లో పాల్గొననున్నారు.

ఇక ఈ చిత్రం తర్వాత దర్శకుడు గుణశేఖర్ డైరెక్షన్ లో హిరణ్య చిత్రాన్ని ప్రారంభించనున్నారట. నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ కథలో రానా నక్సలైట్ గా నటిస్తుండగా, సాయి పల్లవి జానపద గాయనిగా కనిపించనుంది. అయితే సాయి పల్లవి పై కీలక సన్నివేశాలను ఇప్పటికే షూట్ చేసింది చిత్రబృందం. కానీ, రానాకి సంబంధించిన సీన్స్ షూట్ చేయనున్నారు.

Exit mobile version