బాలీవుడ్ సూపర్ స్టార్‌తో కలిసి రానా తెలుగు సినిమా!

rana-and-akshy
రానా.. తెలుగు, తమిళ, హిందీ ఇలా దేశంలోని ప్రధాన భాషల సినిమాల్లో నటిస్తూ అందరికీ సుపరిచితుడైన నటుడు. తాజా ప్రభంజనం ‘బాహుబలి’ తర్వాత రానా ఏకంగా స్టార్ స్టేటస్‌ను సంపాదించారు. ప్రస్తుతం బెంగళూర్ డేస్ తమిళ రీమేక్, బాహుబలి 2 సినిమాలతో బిజీగా ఉన్న ఆయన, బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌తో కలిసి ఓ తెలుగు సినిమా చేయనున్నానని ప్రకటించడం ఆసక్తికర అంశం. హిందీలో ‘బేబీ’ సినిమాలో కలిసిన నటించిన ఈ ఇద్దరూ ఆ తర్వాత మంచి మిత్రులయ్యారు.

ఇప్పుడు తమ బంధాన్ని సినిమా నిర్మాణానికి కూడా విస్తరించి అక్షయ్-రానాలు తెలుగులో ‘పోస్టర్ బాయ్స్’ పేరుతో ఓ సినిమా ప్లాన్ చేశారు. అక్షయ్ కుమార్, రానా సంయుక్తంగా నిర్మించనున్న ఈ తెలుగు సినిమాకు గోపీ గణేష్ దర్శకత్వం వహించనుండగా, డార్లింగ్ స్వామి స్క్రిప్ట్ సమకూరుస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని రానా తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా తెలియజేస్తూ, ఓ మరాఠీ సూపర్ హిట్ సినిమాకు రీమేకే ఈ పోస్టర్ బాయ్స్ అని తెలిపారు. ఇందుకు కాస్టింగ్ కాల్‌ను పోస్ట్ చేస్తూ కొత్త నటుల కోసం వెతుకుతున్నామని తెలియజేశారు. బాలీవుడ్‌లో ప్రాముఖ్యం పొందిన హీరోలే నిర్మాతలుగా సినిమాలు తీసే పద్ధతి తెలుగు సినిమాకూ విస్తరించడం ఆహ్వానించదగ్గ విషయం.

Exit mobile version