కాబోయే భార్యను పరిచయం చేసిన రానా..!

Rana Daggubati

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ రానా తన ప్రేయసిని పరిచయం చేశాడు.తన ప్రపోజల్ కి ఆమె ఎస్ అన్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా ఎలియజేయడంతో పాటు వారి ఫోటోను పంచుకున్నారు. రానా మనసు దోచిన ఆమె పేరు మిహిక బజాజ్ అని తెలుస్తుంది. చాలా కాలంగా రానా పెళ్లి పై వార్తలు వస్తుండగా నేడు ఆయన కాబోయే భార్యను పరిచయం చేసి అందరికి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం రానా వయసు 35 సంవత్సరాలు. త్వరలోనే వీరు పెళ్లి పీటలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

రానా ప్రస్తుతం తెలుగులో విరాట పర్వం సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఆయన నటించిన పాన్ ఇండియా మూవీ అరణ్య విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే కొన్ని హిందీ, తమిళ చిత్రాలకు కూడా ఆయన కమిటై ఉన్నారు. వీటితో పాటు గుణశేఖర్ దర్శకత్వంలో ఆయన హిరణ్య కసిప మూవీలో నటించాల్సివుంది.

Exit mobile version