టీజర్ టాక్: ‘రణబాలి’తో విజయ్ దేవరకొండ విస్ఫోటనం.. ఊహించని రేంజ్ లో ర్యాంపేజ్

మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా సినిమా రణబాలి కోసం అందరికీ తెలిసిందే మ్ భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి ఎట్టకేలకు అంతా ఎదురు చూస్తున్న టీజర్ రానే వచ్చింది. అయితే ఈ టీజర్ మాత్రం ఒక విస్ఫోటనం అని చెప్పి తీరాలి.

చరిత్ర పుటల్లో మనకి తెలియని ఒక స్వాతంత్ర సమర యోధుడు జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఈ సినిమా విజువల్స్ ఊహించని లెవెల్లో ఉన్నాయని చెప్పాలి. ముందు అంతా బ్రిటిష్ కాలంలో భారతీయులు పడ్డ బాధలను దర్శకుడు చాలా హార్డ్ హిట్టింగ్ గా ప్రెజెంట్ చేసారు.

ఇక మమ్మి విలన్ ని కూడా అంతే క్రూరంగా చూపిస్తూ ఒక సాలిడ్ సెటప్ విజయ్ దేవరకొండకి సెట్ చేసి ఇక అక్కడ నుంచి మొదలైన విజయ్ దేవరకొండ రణబాలి సీన్స్ అమోఘం. తనపై ప్రతీ విజువల్ టికెట్ కి పెట్టిన ప్రతీ పైసాకి న్యాయం చేసేలా కనిపిస్తుంది. సాలిడ్ ఎమోషన్స్, తన డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ లలో ఎక్కడా విజయ్ కనపడలేదు.

కేవలం రణబాలి మాత్రమే కనపడ్డారు అన్నట్టుగా సాలిడ్ పెర్ఫామ్ చేసాడు. ఇక ఇందులో కెమెరా వర్క్ కానీ సంగీతం గాని అంతే టాప్ నాచ్ లో ఉన్నాయి. దీనితో ఈ దసరా బరిలో రణబాలి తో విజయ్ ఒక సెన్సేషనల్ కంబ్యాక్ కొట్టడం గ్యారెంటీ అన్నట్టు కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version