హను దర్శకత్వంలో రానా?

rana-dagubati

అందాల రాక్షసి దర్శకుడు హను రాఘవపుడి దర్శకత్వంలో దగ్గుబాటి రానా హీరోగా నటిస్తాడు అన్న వార్త వినిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చనుంది. బాహుబలి సినిమాలో ప్రస్తుతం బిజీగా వున్న రానా త్వరలో ఈ సినిమాలో నటిస్తాడని సమాచారం. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది

అందాల రాక్షసి తరువాత హను సైలెంట్ అయిపోయాడు. ఆ మధ్య రామ్ తో ఒక సినిమా తీస్తున్నాడు అని వార్తలోచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. మరి ఈ రానా సినిమా అయినా త్వరగా సెట్స్ పైకి వెళ్ళాలని కోరుకుందాం

Exit mobile version