ఓన్ బ్యానర్ లాంచ్ కి టైం ఫిక్స్ చేసిన రానా

ఓన్ బ్యానర్ లాంచ్ కి టైం ఫిక్స్ చేసిన రానా

Published on Sep 3, 2015 5:40 PM IST

rana-dagubati
టాలీవుడ్ యంగ్ హంక్ రానా దగ్గుబాటి లీడర్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యి ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా బాహుబలి ఇచ్చిన విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు రానా. సినీ నిర్మాణరంగం కి చెందిన దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన రానాకి ప్రొడక్షన్ సైడ్ కూడా మంచి అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే రానా హీరోగా కొనసాగుతూనే నిర్మాతగా కూడా మారి, సరికొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చెయ్యాలని అనుకున్నాడు. తన నిర్మాణ సంస్థకి పార్టనర్ గా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ని ఎంచుకున్నాడు.

వీదిద్దరి కాంబినేషన్ లో త్వరలోనే ఓ ప్రొడక్షన్ హౌస్ లాంచ్ కానుందని ఇది వరకే తెలియజేశాం. తాజాగా మాకు అందిన సమహ్చారమ్ ప్రకారం వీరిద్దరూ ఎప్పుడు తమ న్యూ ప్రొడక్షన్ హౌస్ ని లాంచ్ చేయనున్నారు అనే విషయం తెలిసింది. అక్టోబర్ రెండవ వారంలో మీడియా సమక్షంలో వీరిద్దరూ తమ బ్యానర్ పేరు, లోగో మరియు మొదటగా తాము చేయబోయే సినిమాకి సంబందించిన విషయాలను తెలియజేయనున్నారు. ఈ బ్యానర్ లో టాలెంట్ ఉన్న న్యూ కమర్స్ కి అవకాశాలు ఇచ్చి, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు