మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ చిత్రం ఆయన కెరీర్లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ విలేజ్ డ్రామా మొదటిరోజే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని నెల రోజులు గడిచేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ ను ఖాతాలో వేసుకుని ‘బాహుబలి’ తర్వాత బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఇక షేర్ విషయానికొస్తే ఇప్పటివరకు ఈ సినిమా రూ.116 కోట్ల షేర్ ను రాబట్టుకుని డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాల్ని ఆర్జించి పెడుతూ ఇప్పటికీ సి సెంటర్లలో మంచి రన్ కనబరుస్తోంది. ఓవర్సీస్లో సైతం 3.5 మిలియన్ డాలర్లకు దగ్గరైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోని పలు ఏరియాల్లో నాన్ బాహుబలి-2 రికార్డుల్ని క్రియేట్ చేసింది.
‘మగధీర’ తరవాత ఆ స్థాయి విజయాన్ని ఈ సినిమాతోనే అందుకున్న రామ్ చరణ్ నటుడిగా కూడ తానేంటో నిరూపించుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో సమంత, ఆది పినిశెట్టి, ప్రకాష్ రాజ్ వంటివారు నటించారు.
