‘బాహుబలి-2’ తర్వాత ‘రంగస్థలం’ !

Rangastlam1

గత నెల 30న విడుదలైన ‘రంగస్థలం’ చిత్రం తెలుగునాట ఏ స్థాయిలో ఆడుతుందో తెలిసిందే. మొదటి వారంలోనే ప్రపంచావ్యాప్తంగా దాదాపు రూ.80 కోట్ల షేర్ ను రాబట్టుకున్న ఈ చిత్రం ‘బాహుబలి-1’ తర్వాత స్థానంలో నిలిచింది. ఇక చెన్నై సిటీలో అయితే 8 రోజులకు కలిపి కోటి రూపాయల గ్రాస్ ను అందుకున్న ఈ సినిమా ‘బాహుబలి-1’ ను దాటేసి ‘బాహుబలి-2’ తర్వాతి స్థానంలో నిలించింది.

తమిళ నిర్మాతల మండలి చేస్తున్న నిరసన మూలాన పెద్ద తమిళ సినిమాల విడుదలలు ఆగిపోవడం ‘రంగస్థలం’ కలెక్షన్లకు బాగా కలిసొచ్చింది. ఇక ఓవర్సీస్లో సైతం 2.8 మిలియన్లను క్రాస్ చేసిన ఈ సినిమా త్వరలోనే 3 మిలియన్లను అందుకోనుంది. ‘మగధీర’ తర్వాత చరణ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ‘రంగస్థలం’ నిలిచింది.

Exit mobile version