అమరావతిలో ‘రంగస్థలం’ సక్సెస్ మీట్ ?

‘రంగస్థలం’ చిత్రంతో రామ్ చరణ్ చాలా ఏళ్ల తర్వాత సాలిడ్ హిట్ అందుకున్నారు. అంతేగాక నటుడిగా కూడ నూటికి నూరు మార్కులు వేయించుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకోవడానికి భారీ స్థాయిలో సక్సెస్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట టీమ్.

అది కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరుగుతుందని అంటున్నారు. ఈ వేడుకకు మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ ముఖ్య అతిథులుగా హాజరవుతారట. నిన్న చరణ్ తో కలిసి ‘రంగస్థలం’ను వీక్షించిన పవన్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సినిమా గురించి సక్సెస్ మీట్లో మాట్లాడుతానంటూ తాను కూడ హాజరవుతున్నట్టు హింట్ ఇచ్చారు.

Exit mobile version