
మన టాలీవుడ్ లో ఉన్నటువంటి హీరోల్లో ఏ ఇండస్ట్రీకి అయినా సెట్టయ్యే కటౌట్స్ లో సూపర్ స్టార్ మహేష్ ఖచ్చితంగా ఉంటారు. ఇన్నేళ్లు అయినా తమ డామ్న్ లుక్స్ తో స్టన్ చేస్తూ ఉండే మహేష్ సినిమాలతో పాటుగా పలు యాడ్స్ కూడా చేస్తారన్న సంగతి తెలిసిందే.
వాటిలో థమ్స్ అప్ యాడ్ కూడా ఒకటి. అయితే ఇన్ని రోజులు దీనికి తెలుగులో మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా హిందీలో స్టార్ హీరో రణ్వీర్ సింగ్ లు కనబడేవారు. కానీ ఈసారి వీరిద్దరితో అదిరిపోయే యాక్షన్ యాడ్ ను షూట్ చేశారు. మరి వీరి కలయికలో రణ్వీర్ మహేష్ ను ఉద్దేశించి ఓ ఆసక్తికర పోస్ట్ ను పెట్టారు.
మహేష్ తనకు పరిచయం అయిన వారిలో అత్యంత ఫైనెస్ట్ జెంటిల్ మెన్స్ లో ఒకరని మా కలయిక ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది అని నా బిగ్ బ్రదర్ మహేష్ కు తన ప్రేమ గౌరవం ఎప్పుడూ ఉంటాయి అని రణ్వీర్ మహేష్ పై ఆసక్తికర పోస్ట్ ను పెట్టారు.