కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ అంటే ప్రపంచ వ్యాప్తంగా తెలియని వారు ఉండరు. పాప్ ప్రపంచంలో ఇప్పుడు తాను లేకపోయినప్పటికీ తన దగ్గరకి కూడా రాలేని రీతి సామ్రాజ్యాన్ని మైఖేల్ జాక్సన్ సెట్ చేసి పెట్టారు. మరి అలాంటి వ్యక్తి జీవిత చరిత్రపై తెరకెక్కిన సెన్సేషనల్ బయోపిక్ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
ఇండియాలో కూడా ఈ సినిమాకి బంపర్ బుకింగ్స్ మరియు సాలిడ్ నంబర్స్ పడుతున్నాయి. ఇక ఈ విడుదల సమయంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ అప్పటి మైఖేల్ జాక్సన్ తో కలిసిన ఒక రేర్ పిక్ ని షేర్ చేసుకొని ఈ రిలీజ్ రోజు అప్పటి సమయాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నారు. అది కేవలం ఒక్క మెమొరీ మాత్రమే కాదు కాలాన్ని ఆపిన క్షణం అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
మైఖేల్ ఒక ఆర్టిస్ట్ కాదు ఒక ఎక్స్ పీరియెన్స్, నువ్వు భూమి మీద నడిచినందుకు మేమెంతో గర్విస్తున్నాము అలాగే నీ ఆర్ట్, అమాయకత్వంతో కోట్లాది మందిని టచ్ చేసావు అంటూ మైఖేల్ తో కలిసి దిగిన ఒకప్పటి అరుదైన క్షణాన్ని పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు అనుపమ్. ఇక అనుపమ్ ఇప్పుడు ప్రభాస్ తో ఫౌజీ సహా ఇతర తెలుగు, హిందీ ఇండస్ట్రీ లలో భారీ సినిమాలు చేస్తున్నారు.
Dearest Michael Jackson,
This photograph is not just a memory… it is a feeling frozen in time.🥹🥹
I still remember the moment I shook your hand. For that brief second, the fanboy in me took over completely.
It was surreal… almost unbelievable… like touching a piece of magic.… pic.twitter.com/TGzesvVf6J— Anupam Kher (@AnupamPKher) April 24, 2026
