‘శివమ్’కి స్పెషల్ అట్రాక్షన్ గా రాశిఖన్నా గ్లామర్ డోస్.!

Rashi-kanna
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో కుర్రాకారు హృదయాల్ని కొల్లగొట్టిన అందాల భామ రాశి ఖన్నా. మొదతీ సినిమాలో హిమ్లీగా కనిపించిన రాశి ఖన్నా సెకండ్ సినిమా ‘జిల్’లో బాగా గ్లామరస్ గా కనిపించి యువతని అట్రాక్ట్ చేసింది. ఇప్పుడు తను ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన నటించిన సినిమా ‘శివమ్’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని పనులతో పాటు రిలీజ్ కి కూడా ఆల్ క్లియర్ చేసిన ఈ చిత్ర టీం ప్రమోషన్స్ చేసుకుంటూ, సినిమా సక్సెస్ టాక్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ మరియు సాంగ్స్ లో రాశి ఖన్నా చాలా గ్లామరస్ గా ఉంది. ఈ విషయం గురించి కనుక్కుంటే.. ఈ సినిమాలో రాశి ఖన్నా గత సినిమాల కంటే ఎక్కువ గ్లామరస్ గా కనిపించడమే కాకుండా స్కిన్ షో కూడా ఈ సినిమాలో బాగా ఎక్కువగానే చేసిందని సమాచారం. శివమ్ సినిమాలో సాంగ్స్ లో విజువల్స్ తో పాటు రాశి ఖన్నా గ్లామర్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని సమాచారం. కామెడీ, లవ్, యాక్షన్ అంశాలతో వస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కానున్నాడు. స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.

Exit mobile version