
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై యువ హృదయాలను కొల్లగొట్టిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. రాశి ఖన్నా గోపీచంద్ సరసన నటించిన లేటెస్ట్ మూవీ మార్చి 27న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. కాసేపు ఇది పక్కన పెడితే తెలుగులో వరుసగా హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మంచి ఆఫర్ వస్తే, ఐటమ్ సాంగ్స్ చెయ్యడానికి కూడా సిద్దమేనని రాశి ఖన్నా ఇటీవలే తెలిపింది. మాకు అందిన లేటెస్ట్ న్యూస్ ప్రకారం అప్పుడే రాశి ఖన్నా తన తొలి తెలుగు ఐటెం సాంగ్ కి సైన్ చేసింది.
అసలు విషయంలోకి వెళితే.. అక్కినేని ఫ్యామిలీ నవతరం వారసుడు అఖిల్ అక్కినేని హీరోగా, వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చెయ్యడానికి రాశి ఖన్నా సైన్ చేసింది. చాలా మాస్ బీట్ తో సాగే ఈ పాటని రూరల్ బ్యాక్ డ్రాప్ లో షూట్ చేయనున్నారని సమాచారం. త్వరలోనే ఈ సాంగ్ ని షూట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అఖిల్ సరసన సయేశా సైగల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ మూడవ షెడ్యూల్ మార్చి 17 నుంచి మొదలు కానుంది. తమన్ – అనూప్ రూబెన్స్ కలిసి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని నితిన్ నిర్మిస్తున్నాడు.