‘రణబాలి’: రష్మికకి వీడ్కోలు.. బ్యూటిఫుల్ వీడియో వైరల్!

ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సాలిడ్ చిత్రాల్లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తన భార్య, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నాలు హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న హిస్టారికల్ చిత్రమే ‘రణబాలి’. ఇటీవల వచ్చిన టీజర్ తో సాలిడ్ హైప్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం పట్ల అంచనాలు మరింత ఎక్కువ అయ్యాయి.

అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆఖరి దశకు చేరుకోగా మేకర్స్ ఓ బ్యూటిఫుల్ వీడియో విడుదల చేశారు. ఈ చిత్రంలో తమ జయమ్మ రష్మిక మందన్నా తన పోర్షన్ లని పూర్తి చేసుకున్నట్టు తెలిపారు. దీనితో ఆమె దర్శకుడు, విజయ్ దేవరకొండలను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న వీడియోతో ఆమెని మిస్ అవుతామని తెలిపి షూట్ నుంచి వీడ్కోలు పలికారు.

దీనితో ఈ వీడియో ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి అజయ్, అతుల్ లు సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ అక్టోబర్ 16న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది.

Exit mobile version