‘రేజర్’ : న్యాయం కోసం బ్రూటల్‌గా మారిన రవిబాబు.. చూస్తే షాకే..!

రేజర్

యాక్టర్ కమ్ డైరెక్టర్ రవిబాబు మరో ఇంట్రెస్టింగ్ సినిమాని అనౌన్స్ చేశారు. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే, ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడుతుంది. ఇక ఆయన ఇప్పుడు మరో క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన డైరెక్ట్ చేస్తూ నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘రేజర్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

ఇక ఈ టైటిల్ గ్లింప్స్ వీడియో చూస్తే ప్రేక్షకులు షాక్ అవ్వాల్సిందే. న్యాయం కోసం బ్రూటల్‌గా మారిన రవిబాబు మనకు ఈ వీడియోలో కనిపిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులను అత్యంత దారుణంగా హతమార్చిన ఈ వీడియోతో రవిబాబు ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేశారు. ఇక ఈ సినిమాతో రవిబాబు ఎలాంటి ట్రీట్ ఇస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమాను ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుండగా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది. ఇక ఈ సినిమాను 2026 వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version