‘రేజర్’ రెడీ : శరవేగంగా షూటింగ్ ముగించిన రవి బాబు!

razor

విలక్షణ డైరెక్టర్ కమ్ యాక్టర్ రవి బాబు ఇటీవల ‘రేజర్’(Razor )అనే చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఎ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌లో తెరకెక్కుతోంది. పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాలో రవి బాబు లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. ‘రేజర్’ చిత్ర షూటింగ్ ముగిసిందని తెలియజేస్తూ ఓ వీడియోను వదిలారు చిత్ర యూనిట్. రవి బాబు సూపర్ స్పీడ్‌తో ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఆ తర్వాత ప్రమోషన్స్ నిర్వహించి ‘రేజర్’ చిత్రాన్ని సమ్మర్ కానుకగా మే నెలలో థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version