రవితేజ-దిల్‌రాజుల ‘ఎవడో ఒకడు’ మొదలైంది!

dil-raj-and-ravi-teja
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మాణంలో ఓ సినిమా అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. ‘ఎవడో ఒకడు’ అన్న ఆసక్తికర టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘ఓ మై ఫ్రెండ్’ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దసరా పర్వదినం సందర్భంగా ఈ ఉదయం హైద్రాబాద్‌లో ఎవడో ఒకడు సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్, సుకుమార్ అతిథులుగా హాజరు అయి సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

తమ సంస్థలో మంచి కంటెంట్‌తో వస్తోన్న మరో మంచి సినిమా ‘ఎవడో ఒకడు’ అని, తప్పకుండా ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉందని నిర్మాత దిల్‌రాజు తెలిపారు. నవంబర్ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని, సమ్మర్ సీజన్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని దిల్‌రాజు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ఇక రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Exit mobile version