
మాస్ మహారాజ్ రవితేజ మీడియా ముందుకు వచ్చి బాగా అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేయడం చాలా తక్కువగా సరుగుతూ ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం దానికి విరుద్దంగా కిక్ 2 సినిమాని మీడియాలో జోరుగా ప్రమోట్ చేస్తున్నాడు. రవితేజ నటించిన ‘కిక్ 2’ సినిమా ఈ శుక్రవారం అనగా ఆగష్టు 21న గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దంగా ఉంది. దీంతో రవితేజ జోరుగా ప్రమోషన్ చేస్తున్నాడు. అంతే కాకుండా తన సినిమా ప్రమోషన్స్ లో చిన్న సినిమాలను గురించి కూడా మెచ్చుకుంటున్నాడు.
నిన్న జరిగిన ప్రెస్ కాన్ఫిరెంస్ లో రవితేజ మాట్లాడుతూ ‘ఇటీవల వచ్చిన సినిమా చూపిస్త మావ చాలా బాగుంది, రాజ్ తరుణ్ చాలా బాగా చేసాడు. తన పెర్ఫార్మన్స్ నాకూ నా ఇడియట్ సినిమాని గుర్తు చేసింది. ముందు ముందు కూడా ఇలానే చిన్న చిన్న సినిమాలు వచ్చి బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద విజయాలను నమోదు చెయ్యాలి అప్పుడే సినిమా ఇండస్ట్రీ బాగుంటుందని’ తెలియజేశాడు. స్టార్ హీరో అయిన రవితేజ ఇలా చిన్న సినిమాలను, ఇప్పుడిప్పుడే వస్తున్న యంగ్ హీరోలని ప్రోత్సహించడం వాళ్ళని ఎంతో ప్రోత్సహించినట్లు అవుతుంది. రవితేజ ఇలా చేయడం ఇండస్ట్రీలో చాలా శుభపరిణామం అని చెప్పుకోవాలి.