
మాస్ మహారాజ్ రవితేజ ఇటీవలే కిక్ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ‘కిక్ 2’ సినిమా ద్వారా ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యి నెలరోజులు కూడా కాక ముందే తన తదుపరి సినిమా ‘బెంగాల్ టైగర్’ సినిమా షూటింగ్ ని చివరి దశకు తీసుకొచ్చేసాడు. హైదరాబాద్ లో టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం రేపటి నుంచి యూరప్ లో సాంగ్ షూట్ ని మొదలు పెట్టనున్నారు. ఈ సినిమా తర్వాత రవితేజ హిందీ వెర్షన్ హిట్ ఫిల్మ్ ‘స్పెషల్ 26’ రీమేక్ లో నటించే అవకాశం ఎక్కువ ఉందని మీడియాలో వార్తలు వచ్చాయి.
కానీ తాజాగా రవితేజ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘ఓ మై ఫ్రెండ్’ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన వేణు శ్రీరాం చెప్పిన కథ రవితేజకి బాగా నచ్చేసిందట. అంతే కాకుండా వేణు శ్రీరాం సరికొత్తగా డిజైన్ చేసిన హీరో పాత్ర రవితేజకి చాలా బాగా నచ్చేసిందని, అలాంటి పాత్రని రవితేజ ఇది వరకూ చేయలేదని సమాచారం. దాంతో రవితేజ వేణు శ్రీరాంకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన విశేషాలను అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. ప్రస్తుతం చివరి దశలో ఉన్న బెంగాల్ టైగర్ ని అక్టోబర్ చివర్లో లేదా నవంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

