మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న డివోషనల్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
అయ్యప్ప స్వామి మాలధారణ, భక్తి నేపథ్యంతో పాటు తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని కలబోసి ఈ కథను తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతుంది. రవితేజ సరికొత్త గెటప్‌లో కనిపిస్తూనే, తనదైన శైలిలో అటు ఎమోషన్స్‌ను, ఇటు పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా పండించి మెప్పించాడు. కూతురి కోసం ఏం చేయడానికైనా సిద్ధమయ్యే తండ్రి పాత్రలో రవితేజ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా, జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, బీజీఎం ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. డైలాగ్స్, విజువల్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా రూపుదిద్దుకున్న ఈ సినిమాను ఆగస్టు 21న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
