శర్వానంద్-శ్రీను వైట్ల మూవీ లాంచ్‌కి ముహూర్తం ఫిక్స్..!

చార్మింగ్ స్టార్ శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో కొత్త సినిమా లాంచ్ కానుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ‘#SSS1’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమైంది. ఇక ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ లాంచ్ కానుంది.

ఆగస్టు 14వ తేదీ ఉదయం 9:45 గంటలకు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ చిత్ర పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ పూజా కార్యక్రమానికి చిత్ర యూనిట్‌తో పాటు పలువురు స్టార్స్ రాబోతున్నట్లు తెలుస్తోంది.

‘సైన్స్. సెన్స్. సక్సెస్.’ అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌తో వస్తున్న ఈ సినిమాను రాబోయే సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి శర్వానంద్ కోసం శ్రీను వైట్ల ఎలాంటి కథను రెడీ చేశాడో చూడాలి.

Exit mobile version