రవితేజ సినిమాను కన్ఫర్మ్ చేసిన తమన్నా..!

Tamanna
మాస్ మహారాజ్ రవితేజకు జోడిగా తమన్నాను ఎంపిక చేశారు దర్శకుడు సంపత్ నంది. ఈ విషయాన్ని తమన్నా ట్విట్టర్ లో కన్ఫర్మ్ చేసింది. ఫస్ట్ టైం రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఎగ్జైటింగ్ గా ఉందని పేర్కొంది. సంపత్ నంది గత సినిమా ‘రచ్చ’లో తమన్నా హీరోయిన్ గా నటించింది. అందాల ప్రదర్శనలో, అభినయంలో రచ్చ రచ్చ చేసింది. సంపత్ నంది తనను చూపించిన విధానం పట్ల మీడియాలో చాలా సంతోషాన్ని కూడా వ్యక్తం చేసింది. మరోసారి హిట్ దర్శకుడితో పని చేయడానికి ఆసక్తి కనబరుస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉంది. రవితేజ ‘కిక్ 2’ షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత సంపత్ నంది సినిమాకు డేట్స్ కేటాయించారు. ఈ గ్యాప్ లో మిగతా టెక్నీషియన్ల ఎంపిక పూర్తి చేయాలనీ సంపత్ నంది భావిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ చాలా ఫ్రెష్ గా ఉంటుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.

Exit mobile version