చెన్నై వరద బాధితులకు రవితేజ, వరుణ్‌తేజ్‌ల సహాయం

raviteja-varun-tej
చెన్నై నగరంలో భారీ వర్షాలు, వరదలకు జన జీవనం అస్థవ్యస్థమైన సంగతి తెలిసిందే. ఇక గత మూడు రోజులుగా చెన్నై నగరం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. ఇక విపత్కర పరిస్థితులకు స్పందిస్తూ తమ వంతు సాయంగా తెలుగు హీరోలు ముందుకు వచ్చారు. ఇప్పటికే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మహేష్ బాబు తదితరులు తమవంతుగా చెన్నై బాధితులకు సహాయాన్ని ప్రకటించగా తాజాగా మాస్ మహరాజ్ రవితేజ, యువహీరో వరుణ్ తేజ్ కూడా తమ వంతుగా సహాయాన్ని ప్రకటించారు.

మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ 5 ల‌క్షల విరాళం ప్రక‌టించారు. త్వర‌లోనే త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి జ‌య‌ల‌లిత గారి సి.య‌మ్ రిలీఫ్ ఫండ్‌కి ఈ మొత్తాన్ని అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక హీరో వరుణ్ తేజ్ తన వంతు సహాయం గా 3 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని తమిళ నాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నట్లు గా అయన తెలిపారు.

Exit mobile version