ఫిబ్రవరి నుంచి రవితేజ ‘బెంగాల్ టైగర్’

ravi-teja

మాస్ మహారాజ రవితేజ ‘పవర్’ సినిమా సక్సెస్ తర్వాత వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్నాడు. ఇప్పటికే సూపర్ హిట్ మూవీ ‘కిక్’ సీక్వెల్ అయిన ‘కిక్ 2’ సినిమాని మొదలు పెట్టాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఇది సెట్స్ పై ఉండగా ఇటీవలే సంపత్ నంది డైరెక్షన్ లో ఓ సినిమా చెయ్యడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇదివరకే తెలియజేశాం.

మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా 2015 ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. సంపత్ నంది దానికి తగ్గట్టుగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేస్తున్నాడు. రవితేజ సరసన మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సంపత్ నంది ‘బెంగాల్ టైగర్’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నాడు. రవితేజ ఇమేజ్కి, కథకి ఈ టైటిల్ బాగా సరిపోతుందని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Exit mobile version