మాస్ మహారాజ హీరోగా నటించిన మరో పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ ‘పవర్’. ‘బలుపు’ సినిమాకి రైటర్ గా పనిచేసిన కె.ఎస్ రవీంద్రన్ అలియాస్ బాబీని దర్శకుడిగా పరిచయం చేస్తున్న ఈ సినిమాలో రవితేజ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో మిగిలి ఉన్న చివరి ‘నోటంకి’ సాంగ్ ని గత కొద్ది రోజులుగా రవితేజ – హన్సికలపై రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రంతో పవర్ చిత్ర టీం ఆ సాంగ్ ని కూడా పూర్తి చేసి షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేసారు.
‘పవర్ షూటింగ్ ఫినిష్ చేసాం. ఇకపై పవర్ టీంని మిస్ అవుతాను. ఈ సినిమాలో నేను ఓ పార్ట్ అవ్వడం హ్యాపీగా ఉంది. సెప్టెంబర్ 5 కోసం ఎదురు చూస్తున్నానని’ హన్సిక ట్వీట్ చేసింది. రవితేజ సరసన హన్సికతో పాటు రెజీన కసాండ్ర కూడా మరో హీరోయిన్ గా కనిపించనుంది. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించిన ఆడియో ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. సెప్టెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమాకి రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత.
