మాస్ రాజా రవి తేజ ప్రధాన పాత్రలో నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు సాలిడ్ రెస్పాన్స్ దక్కడంతో తాజాగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో రవి తేజ మాట్లాడుతూ నిర్మాత సుధాకర్ చెరుకూరిని అభినందించారు. “మా మొదటి సినిమా రామారావు ఆన్ డ్యూటీ ప్రేక్షకులను నిరాశపరిచింది. అది సీరియస్ సినిమా. కానీ ఈసారి పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంతో వచ్చాం. పోటీలో ఉన్న ఇతర సినిమాలతో పాటు మా సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా తప్పకుండా లాంగ్ రన్ కంటిన్యూ చేస్తుందని ఆశిస్తున్నా” అని అన్నారు. సినిమా విజయంలో భాగస్వాములైన ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
హాలిడే సీజన్ తర్వాత ఈ సినిమా ఎలా నిలబడుతుందో చూడాలి. ఈ చిత్రంలో సత్య, వెన్నెల కిశోర్, సునీల్, సుధాకర్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
