మాస్ మహారాజ రవితేజ హీరోగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘ఇరుముడి’. చాలా కాలం తర్వాత రవితేజ నుంచి సినిమా వస్తుంది అంటే అందరి ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాగా ఇది నిలిచింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇదే ఊపులో ఈ సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ దిశగా దూసుకెళ్తుంది.
ఆల్రెడీ తెలుగు స్టేట్స్ లో మంచి బుకింగ్స్ ఈ చిత్రానికి నమోదు అవుతుండగా యూఎస్ మార్కెట్ లో కూడా స్ట్రాంగ్ ప్రీ సేల్స్ ఈ చిత్రానికి జరుగుతున్నాయి. అక్కడ ఆల్రెడీ 2 లక్షల 50 వేల డాలర్స్ గ్రాస్ మార్క్ ని ఈ సినిమా దాటేసింది. సో ‘ఇరుముడి’ తో రవితేజ తన కెరీర్లో మరో బెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకోవడం ఖాయం అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.


