మాస్ బుకింగ్స్ తో దూసుకెళ్ళిపోతున్న ‘ఇరుముడి’.. రిలీజ్ కి ముందే 2 లక్షల టికెట్స్

మాస్ బుకింగ్స్ తో దూసుకెళ్ళిపోతున్న ‘ఇరుముడి’.. రిలీజ్ కి ముందే 2 లక్షల టికెట్స్

Published on Aug 20, 2026 8:04 PM IST

Irumudi

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ కోసం అందరికీ తెలిసిందే. మంచి హైప్ ని సెట్ చేసుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. ఇలా ఫైనల్ గా అనుకున్న సమయానికే తెలుగు, తమిళ్ లో విడుదల అవుతున్న ఈ సినిమా ఇప్పుడు రవితేజ కెరీర్ లోనే సాలిడ్ ఓపెనింగ్స్ పై కన్నేసి బుకింగ్స్ పరంగా దూసుకెళ్తుంది.

ఇలా సినిమా రిలీజ్ కి ముందే ఇండియా వైడ్ గా బుక్ మై షో, డిస్ట్రిక్ట్ వంటి యాప్స్ లో కలిపి 2 లక్షల టికెట్స్ కి పైగా సినిమాకి సేల్ అయ్యిపోయాయి. ఇదంతా సినిమా రిలీజ్ కి ముందే కావడం విశేషం. విడుదల అయ్యాక జస్ట్ టాక్ పాజిటివ్ పడితే చాలు మళ్ళీ ‘క్రాక్’ రోజులు వెనక్కి వచ్చినట్టే అని చెప్పొచ్చు.

రవితేజ సినిమాలకి మంచి లాంగ్ రన్స్ పడుతూ ఉంటాయి. సో ఈ సినిమాకి అన్నీ వర్కౌట్ అయితే నెక్స్ట్ వీక్ టాక్సిక్ ఉన్నా ఇరుముడి మంచి పెర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు