మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ‘ఇరుముడి’ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రైలర్‌కి లభించిన పాజిటివ్ రెస్పాన్స్‌తో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఊపందుకున్నాయి. అయితే, గత కొంతకాలంగా సరైన విజయం లేక వరుస పరాజయాలతో సతమతమవుతున్న రవితేజకు ఈ చిత్రం అత్యంత కీలకమైనది.
ఇలాంటి సమయంలో ప్రమోషన్స్‌లో మరింత దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పాల్గొనడంతో పాటు కేవలం ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వడం మాత్రమే సరిపోదని సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత కాలంలో ప్రతి హీరో తమ సినిమాల కోసం విరివిగా ఇంటర్వ్యూలు ఇవ్వడమే కాకుండా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ముఖాముఖిలు, పాడ్‌కాస్ట్‌లలో పాల్గొంటూ విస్తృత ప్రచారం చేస్తున్నారు.
కానీ, రవితేజ మాత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ తర్వాత ప్రమోషన్స్‌కు దూరంగా ఉండటం కాస్త నిరాశపరిచే అంశం. ఆగస్టు 21న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా, శివ నిర్వాణ దర్శకత్వం వహించారు.
