‘అమర్ అక్బర్ ఆంటొని’ తరువాత మాస్ మహారాజ్ రవితేజ తన కొత్త చిత్రాన్ని వి ఐ ఆనంద్ దర్శకత్వంలో చేయనున్నాడని తెలిసిందే. ఇటీవలే ఈచిత్రం అధికారికంగా లాంచ్ కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఇక రవితేజ వరుసగా హ్యాట్రిక్ పరాజయాలను చవి చూడడంతో ఈకొత్త సినిమా స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట. అందుకే ఈ సినిమా ప్రకటన ఆలస్యం అవుతుందట.
ఇక ఎట్టకేలకు ఈసినిమా లాంచ్ కు ముహూర్తం కుదిరిందని సమాచారం. రవితేజ పుట్టిన రోజు సందర్భంగా జనవరి 26న ఈ చిత్రాన్ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట దర్శక నిర్మాతలు. అయితే ఈ విషయంపై తర్వలోనే క్లారిటీ రానుంది.
సై -ఫై థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నాబా నటేష్ , పాయల్ రాజ్ పుత్ కథానాయికలుగా నటించనున్నారు. తమన్ సంగీతం అందించనున్న ఈచిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు.
