
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న మరో మాస్ ఎంటర్టైనర్ చిత్రం “క్రాక్”. పవర్ ఫుల్ పోలీస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి రేస్ లో నిలపడం ఖాయం అయ్యింది.
ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే సినిమా అవుట్ ఫుట్ విషయంలో మేకర్స్ చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. అలాగే దీనికి ముందు మంచి హిట్ లేనప్పటికీ ఈ చిత్రంపై సాలిడ్ అంచనాలు కూడా నెలకొన్నాయి. అయితే ఇప్పుడు రవితేజ ఈ సినిమాలో ఫైనల్ టచ్ కు రెడీ అయ్యిపోయారు.
అదే డబ్బింగ్. ఇప్పుడు రవితేజ మొత్తం డబ్బింగ్ ఫినిష్ చేసేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే కొత్త సంవత్సర కానుకగా రానున్న ట్రైలర్ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇది ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సరస్వతి ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.