సుకుమార్, అల్లు అర్జున్ కొత్త సినిమా ఇటీవలే లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. సుకుమార్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తన ఫేవరెట్ ఛాయిస్ దేవి శ్రీ ప్రసాద్ ను తీసుకున్నారు. కానీ సినిమాటోగ్రఫీ కోసం రత్నవేలును కాకుండా కొత్త టెక్నీషియన్ మీరోస్లవ్ కుబ బ్రోజెక్ ను తీసుకున్నారు. సుకుమార్, రత్నవేలుది సూపర్ హిట్ కాంబో.
సుకుమార్ సంగం సినిమాలకు ఆయనే ఛాయాగ్రహకుడు. అలాంటిది ఈ కొత్త సినిమాకు ఆయన్ను పక్కనబెట్టారు. అందుకు కారణం రత్నవేలు యొక్క బిజీ షెడ్యూల్ అని తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్, అనిల్ రావిపూడిల ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి పనిచేస్తున్న రత్నవేలు ఇంకొన్ని బడా ప్రాజెక్ట్స్ ఒప్పుకుని ఉన్నారట. అవి పూర్తికావడానికి ఇంకొంచెం సమయం పడుతుందట. అందుకే ఆయన కోసం ఆగితే సినిమా ఆలస్యం అవుతుందని ఈసారికి వేరొకరిని తీసుకున్నారు సుకుమార్.
ఇకపోతే సుకుమార్ ఎంచుకున్న మీరోస్లవ్ కుబ బ్రోజెక్ ఇటీవలే వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాకు, పలు పోలిష్ సినిమాలకి పనిచేశారు.
