పాపులర్ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో రీసెంట్ గా తీసుకొచ్చిన పలు హిట్ కంటెంట్ లో బ్లాక్ బస్టర్ సిరీస్ “మట్కా కింగ్” కూడా ఒకటి. ఎం సి ఏ చిత్రం విలన్ వినయ్ వెర్మ నటించిన ఈ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మనీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఆడియెన్స్ లో సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది.
ఎపిసోడ్ ఎపిసోడ్ కి ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ లు మంచి హై మూమెంట్స్ తో సాగిన సిరీస్ కి ఆడియెన్స్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ రావడంతో ఇప్పుడు తాను దీనికి కొనసాగింపుగా సీజన్ 2 ని సిద్ధం చేస్తున్నట్టుగా ప్రైమ్ వీడియో వారు అధికారికంగా అనౌన్స్ చేశారు. దీనితో మట్కా కింగ్ సీజన్ 2 పై మంచి హైప్ సెట్ అయ్యింది.
సీజన్ 1 లో దాదాపు కథని పూర్తి చేసేసారు కానీ సీజన్ 2 ని ఎలా స్టార్ట్ చేస్తారో చూడాలి. విజయ్ వెర్మతోనే ఉంటుందా లేక మరో వెర్షన్ లో కొత్తగా ఏమన్నా చేస్తారా అనేది కాలమే నిర్ణయించాలి. ఇక ఈ సిరీస్ ని దర్శకుడు నాగరాజ్ మంజులే తెరకెక్కించారు.
