యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో ఒక టీవీ షో చేయనున్నట్లు జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ టీవీ షోను జెమినీ టీవీ రూపొందించనుంది. తాజా సమాచారం మేరకు ఈ టీవీ షో అమితాబ్ బచ్చన్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి తరహాలో ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ టీవీ షో కోసం తారక్ రెమ్యునరేషన్ తీసుకోనున్నారట. ఇంతకీ ఆ మొత్తం ఎంతో తెలుసా.. అక్షరాలా 16 కోట్ల రూపాయలట.
అవును గతంకో ఎన్టీఆర్ బాస్ తెలుగు సీజన్ వన్ భారీ సక్సెస్ అయింది. మంచి టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. పైపెచ్చు ఎన్టీఆర్ ఇప్పుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తున్నారు. కాబట్టి ఆయన క్రేజ్, ఫాలోయింగ్ షోకు పెద్ద ప్లస్ అవుతాయి. అందుకే ఛానెల్ యాజమాన్యం అంత పెద్ద మొత్తంలో పారితోషకం ఇవ్వడానికి సిద్ధమైందని ఫిలిం నగర్ టాక్. ఒకవేళ ఇదే నిజమైతే టీవీ షో ద్వారా అత్యధిక మొత్తం సంపాదించే తెలుగు హీరోగా తారక్ కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తారు. మరి షో ఎప్పుడు మొదలవుతుంది అంటే ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ మొత్తం ఒక కొలిక్కి వచ్చాకే అవుతుందని అనుకోవచ్చు.
