
మొదట్లో మీడియం బడ్జెట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన భామ రెజీన కసాండ్ర. రెజీన తను నటించిన సినిమాలో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడం వలన రేంజ్ పెరగడమే కాకుండా, రవితేజ ‘పవర్’, సాయి ధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాలతో కమర్షియల్ గా పెద్ద హిట్ అందుకుంది. అంతే కాకుండా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో ఓ కమర్షియల్ యాడ్ లో కూడా నటించింది. రెజీన తెలుగులో కాకుండా తన మాతృ భాష తమిళంలో కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది.
రెజీన హీరోయిన్ గా నటించిన ‘రాజతందిరం’ సినిమా గత శుక్రవాటం తమిళనాడులో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి ప్రీమియర్ షో నుంచే సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. విమర్శకులతో పాటు, తమిళ ఆడియన్స్ కూడా ఈ సినిమాని మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే, సినిమాలో వచ్చే ట్విస్ట్స్, డైరెక్షన్ సినిమాకి హైలైట్ అని అంటున్నారు. కొత్త వాళ్ళతో తీసిన ఈ సినిమా అక్కడ రికార్డ్ ఓపెనింగ్స్ సాధించి ఈ చిత్ర టీంని థ్రిల్ చేస్తోంది. రెజీన ప్రస్తుతం తెలుగులో సాయి ధరమ్ తేజ్ సరసన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సెల్’ సినిమాలో నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి హరీష్ శంకర్ డైరెక్టర్.