రాజమౌళి కోసం కీరవాణి ప్లేస్ లో రెహమాన్ వస్తాడట.!

rajmouli-and-kiravani
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన లెజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. ఆయన ‘బాహుబలి – ది కంక్లూజన్’ తర్వాత మ్యూజిక్ కి రిటైర్ మెంట్ ప్రకటించనున్నాడని ఇది వరకే తెలియజేశాం. అప్పటి నుంచి అందరి మదిలోనూ ఉన్న ప్రశ్న ఎంఎం కీరవాణి రిటైర్ మెంట్ ఇచ్చాక టాలీవుడ్ జక్కన్న సినిమాలకి ఎవరు మ్యూజిక్ చేస్తారు.? గత కొద్ది రోజులుగా ఎంఎం కీరవాణి తర్వాత ఆ చాన్స్ అతని బ్రదర్ అయిన కళ్యాణి కోడూరికి వెళ్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదే విషయాన్ని కళ్యాణి కోడూరి ముందు ఉంచితే ‘నాకు తెలిసి ఆ చాన్స్ నాకు లేదు. నా ప్రకారం అన్నయ్యని భర్తీ చెయ్యగల వ్యక్తి ఒకరే అతే ఎఆర్ రెహమాన్. రాజమౌళి కూడా రెహమాన్ కె ఒటేస్తాడని అనుకుంటున్నానని’ తెలిపాడు. మరి ఇండి ఎంత వరకూ జరుగుతుంది అనేది కాలమే నిర్ణయించాలి. కళ్యాణి కోడూరి రీసెంట్ గా మ్యూజిక్ అందించిన ‘హోరా హోరీ’ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే కళ్యాణి మాలిక్ ఆడియో సూపర్ హిట్ అయ్యింది, సినిమా రిలీజ్ అయ్యాక తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే పెద్ద హిట్ అవుతుందని ఈ చిత్ర టీం చెబుతోంది.

Exit mobile version